నెట్వర్క్ సమస్యల కారణంగా ఉపాధి హామీ పనుల్లో హాజరు నమోదు కాక కూలీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ జియ్యమ్మవలస మండలం గొర్లి గ్రామంలో గిరిజన కూలీలు బుధవారం నిరసన చేపట్టారు. ఫేస్ యాప్ వల్ల పనికి వచ్చినా హాజరు నమోదు కాకపోవడంతో రోజువారీ కూలి కోల్పోతున్నామని, గిరిజన ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని వాపోయారు. ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే ఉపాధి హామీ పనులు అమలు చేయాలని, పని దినాలు, కూలి రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.