గరుగుబిల్లి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

మన్యం జిల్లా గరుగుబిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం గురువారం ఉ. 8 - 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ బడే శ్రీనివాసనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. గరుగుబిల్లితో పాటు గొట్టివలస, గొల్లవానివలస, రావుపల్లి, కొత్తూరు, తులసిరామినాయుడువలస, గొట్టివలస, మరుపెంట, దళాయివలస, బురదవెంకటాపురం, పెద్దూరు, కొత్తపల్లి, తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్