శబ్ద కాలుష్యంతో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయి: డీఎంహెచ్ఓ

పార్వతీపురంలో మంగళవారం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు మాట్లాడుతూ, 80 డెసిబెల్స్‌కు మించిన శబ్దాలు చెవికి హానికరమని, శబ్ద కాలుష్యంతో వినికిడి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హెడ్‌సెట్స్, ఇయర్‌బడ్స్, డీజే సౌండ్స్ వల్ల ప్రమాదమని హెచ్చరించారు. వినికిడి లోపం ఉంటే తరచూ మళ్లీ చెప్పమని అడగడం, టీవీ వాల్యూమ్ పెంచడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డా. టి. జగన్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్