దిత్వా తుఫాను ప్రభావం… రైతుల్లో ఆందోళన

దిత్వా తుఫాను ప్రభావంతో మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పు చోటుచేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టిన వరి కంకులను వర్షం పాడుచేస్తుందేమోనని భయంతో, రైతులు తమ పంటను కాపాడుకునేందుకు తొందరగా తరలించి, కల్లాల్లో కుప్పలు వేసి కప్పేస్తున్నారు. మేఘావృతం కావడం, వాతావరణంలో తేమ పెరగడంతో పంట నష్టపోయే అవకాశం ఉందని, వర్షం పడితే పొలాల్లో ఉన్న వరి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్