పదవ తరగతి వాల్యుయేషన్‌పై జే. సీ దృష్టి

పార్వతీపురం జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి మార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు. పార్వతీపురంలోని డీవీఎం పాఠశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యుయేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలను పరిశీలించారు. సమయానికి పారదర్శకంగా మూల్యాంకనం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధ్యాయులకు తాగునీరు, ఓఆర్ఎస్, గాలి, వెలుతురు సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్