కురుపాం :ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు : ఎమ్మెల్యే

ప్రతి ఏజెన్సీ మారుమల గ్రామానికి ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. కొమరాడ మండలంలోని ఆర్తాం పంచాయతీ సీతామాంబపురంలో జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా రూ. 19. 10 లక్షలతో పదివేల లీటర్ల రక్షిత మంచినీటి పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. మంచినీటి ట్యాంకు వద్ద రిబ్బన్‌ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్