కురుపాం: వర్షాలకు ఐదు మేకలు మృతి

మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని అడ్వానంగూడ గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటరావుకు చెందిన ఐదు మేకలు గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా మృతి చెందాయి. వరుస వర్షాల వల్ల గ్రామంలోని పశువుల పాకలు నీటమునిగిపోవడంతో పశువులు మునిగిపోయాయి. స్థానిక గ్రామస్తులు ఈ ఘటనను అధికారులకు తెలియజేయగా, పశుసంవర్ధక శాఖ సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్