కురుపాం: పింఛన్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి

జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి గ్రామ మాజీ సర్పంచ్ బొత్స ప్రకాష్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు అల్లు ఈశ్వరరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు వారణాసి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్