ఎంటిఎస్ ఉపాధ్యాయునిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి విద్యార్థుల మన్ననలు పొందిన చింత సత్యనారాయణ అభినందనీయడని కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట శంకరరావు అభినందించారు. 1998 డిఎస్సీ లో సెలెక్ట్ అయ్యి అప్పుడు ఉద్యోగం పొందలేక రెండేళ్ల క్రితం ఎంటిఎస్ ఉపాధ్యాయునిగా చేరిన సత్యనారాయణ బుధవారం పదవీ విరమణ పొందారు.