కురుపాం మండలం ఏజెన్సీ ప్రాంత చప్పగొత్తిలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పూర్వకాలం నాటి భవనం గోడలు బీటలు వారాయి. వర్షాకాలంలో ఈ భవనం ఎప్పుడు కూలుతుందో అని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు వేరే గదిలో చదువులు చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకముందే భవనాన్ని తొలగించాలని కోరారు.