గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా ప్రాంతమైన మూలబిన్నిడి గ్రామంలో సీతాఫలాలను గిరిజనులు గురువారం అమ్మకానికి సిద్ధం చేశారు. వారు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఎంతో శ్రమపడి వీటిని సేకరించి దిగువ ప్రాంతానికి తీసుకువస్తామని, అయితే ఆశించిన ధర లేక దళారులకే విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే సహజ సిద్ధమైన సీతాఫలాలు దొరుకుతాయన్నారు. ధరలు మాత్రం తక్కువగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.