పీఎం జన్ మాన్ పథకం క్రింద మంజూరైన పనులను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయర్ అన్నారు. పీఎం జన్ మాన్, ఆది కర్మయోగి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మార్చి తరువాత పీఎం జాన్ మాన్ పనులకు నిధులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.