పార్వతీపురం: పిజిఆర్ ఎస్ వివరాలకు 1100 నంబరుకు ఫోన్ చేయవచ్చు

పిజి ఆర్ ఎస్ లో సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్ లో ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్