జిల్లా వ్యాప్తంగా రేపు ఎన్. టి. ఆర్. భరోసా పింఛన్లు పంపిణీ కానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. పేదల సేవలో భాగంగా జిల్లాలోని 1, 40, 672 మందికి రూ. 60, 10, 27, 500/- నిధులను ఎన్. టి. ఆర్. భరోసా పింఛన్లు కింద పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఇందులో కొత్తగా మంజూరుకాబడిన 1, 634 మంది వితంతువు పింఛన్లు ఉన్నట్లు చెప్పారు.