పార్వతీపురం: ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తేదీన మన్యం జిల్లా లో ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడిఎ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఆయన ఛాంబరులో గురువారం నిర్వహించారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్