దివ్యాంగులకు ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. పాలకొండ మండలం కొండవీధికి చెందిన జమ్మన తేజశ్రీ, సీతానగరం మండలం వెంకటా పురంకు చెందిన కట్టమూరి కార్తీక్ తమకు ల్యాప్ టాప్ లను మంజూరు చేయాలని కోరగా, జెసీ వాటిని పంపిణీ చేశారు. అలాగే కొమరాడ మండలం ఆర్థం గ్రామానికి చెందిన వడ్లమాని ప్రసాదరావుకు చెవిటి మిషనును పంపిణీ చేశారు.