ఈ వ్యక్తి కనిపిస్తే సమాచారమివ్వండి

గుమ్మలక్ష్మీపురంలోని సంతవీధిలో శనివారం ఉదయం జరిగిన దొంగతనంలో, ఇద్దరు దుండగులు ఒక మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలుసులు దొంగలించి పారిపోయారు. ఈ ఘటనపై ఎల్విన్ పేట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం, దొంగతనానికి సంబంధించి అనుమానితుడైన ఒక వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అనుమానితుడి వివరాలు తెలిసినా, కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్