మే డే: బొబ్బిలిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక జెండాల ఆవిష్కరణ, ర్యాలీ

మే డే సందర్భంగా బొబ్బిలిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రామిక జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు జె.సి. రాజు మాట్లాడుతూ, ప్రపంచ నిర్మాణానికి మూలస్తంభాలైన కార్మికుల శ్రమను గౌరవించాలని, వారికి పనికి తగ్గ వేతనం అందించాలని, వారి శ్రేయస్సుకు భంగం కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాలు చేయాలని కోరారు. అనంతరం కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్