కుశ లోయ జలపాతాలకు ప్రత్యేక పర్యాటక బస్సు ప్రారంభం

మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం కుశ లోయ జలపాతాల సందర్శన కోసం ప్రత్యేక పర్యాటక బస్సు (రథం)ను ప్రారంభించారు. పార్వతీపురం నుంచి కుశ లోయకు ప్రతి శని, ఆదివారాల్లో ఈ బస్సు అందుబాటులో ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేని ప్రాంతానికి ఈ సేవలు పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటాయని, సురక్షితంగా, సౌకర్యవంతంగా జలపాతాలను వీక్షించేందుకు ఈ బస్సు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఐసీడీఎస్ పీడీ టి. కనకదుర్గ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్