మే 1 నుంచి నెలపాటు వేసవి క్రీడా శిక్షణా తరగతులు

పార్వతీపురం మన్యం జిల్లాలో మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు క్రీడల అభివృద్ధి అధికారి డా. కె శ్రీధరరావు తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 65 కేంద్రాల్లో 21 క్రీడాంశాల్లో నిష్ణాతులు, సీనియర్, జాతీయ స్థాయి క్రీడాకారులు శిక్షణ అందిస్తారు. 8–16 ఏళ్ల బాలబాలికలు పాల్గొనవచ్చు. శిక్షణార్థులకు పోషకాహారం కోసం రూ. 4,680, కేంద్ర నిర్వహణకు రూ. 3 వేలు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్