వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తనయురాలు డాక్టర్ బొత్స అనూష ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్