నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం ఆకుల పేట మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఏఎస్ఎస్ దుర్గాప్రసాద్రావుకు శనివారం ఘనంగా పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, మండల విద్యాధికారి, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, గ్రామ సర్పంచ్ సువ్వాడ రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీరంతా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి దుర్గాప్రసాద్రావు ఎంతో కృషి చేశారని కొనియాడారు.