నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపు పేటలో గల సత్య కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు కె. గౌతమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో, కె. ప్రియదర్శిని TCS (హైదరాబాద్) లో ఉద్యోగాలు సాధించారు. కరస్పాండెంట్ కె. రాంబాబు, ప్రిన్సిపల్ B. విజయశ్రీ, ఏవో కె. సంతోష్, తల్లిదండ్రులు వీరిని అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధించాలని కరస్పాండెంట్ కె. రాంబాబు ఆకాంక్షించారు.