గాంధీనగర్ కాలనీలో ప్రమాదకరంగా మారిన సిసి రోడ్

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో సిసి రోడ్డు ప్రమాదకరంగా మారింది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా 13వ వార్డులో 421 డోర్ నెంబర్ ఎదుట రోడ్డులో మట్టి కుంగిపోయింది. గాంధీనగర్ నుండి కందర్ప కాలనీకి వెళ్లే ఈ రహదారిపై ప్రతిరోజు వాహనదారులు, పెద్దలు, పిల్లలు సంచరిస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్