చంద్రబాబు కీలక నిర్ణయాలు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు!

ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రవాణా, ఇంధన రంగంలో ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సందర్భంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్రానికి త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యం, పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రానున్నాయి.

సంబంధిత పోస్ట్