వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తుల వెల్లువ, కోనసీమలో ఆధ్యాత్మిక సందడి

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజుగా భావించి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణలతో మారుమోగింది. దేవాలయ కమిటీ సభ్యుడు మైక్ వెంకట్ మాట్లాడుతూ, శనివారం స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

సంబంధిత పోస్ట్