ఉచిత రేషన్‌ 6, 822 కుటుంబాలకు అందజేత

విజయనగరం జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లోని 6822 కుటుంబాలకు 'మొంథా' తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత రేషన్‌ అందిస్తుందని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. శనివారం భోగాపురం మండలం చేపలకంచేరులో మత్స్యకారులకు రేషన్‌ పంపిణీ చేశారు. పలువురికి పింఛన్లు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, తహసీల్దార్‌ ఎం. రమణమ్మ, పౌర సరఫరాల అధికారి మురళి, నాయకులు నీలాపు అప్పలరామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్