పాడి రైతుల కోసం ఉచిత పశువైద్య శిబిరం

పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో ఎమ్మెల్యే లోకం మాధవి చేతుల మీదుగా ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాడి రైతుల అభివృద్ధి, పశుసంవర్ధక రంగ బలోపేతం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా రైతులకు ఆర్థిక లాభాలు పెరుగుతాయని, ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్