గౌరీ విద్యానికేతన్ 10వ తరగతిలో అద్భుత ఫలితాలు

శృంగవరపుకోట మండలం భవాని నగర్ లోని గౌరీ విద్యానికేతన్ పాఠశాల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని అస్మిత 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, ద్రాక్షాయిని, యశ్వంత్ 566 మార్కులు సాధించారు. రోహిత్ 534 మార్కులతో తదుపరి స్థానంలో నిలిచారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు కె. వెంకట్రావు తెలిపారు. ఈ ఉత్తమ ఫలితాలకు గాను విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్