భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బంగార్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని నిన్న అంబటి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గు పడేలా ఉన్నాయి అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే అవమానకరమని ఆయన పేర్కొన్నారు.