జరజాపుపేట ఉన్నత పాఠశాలలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పిటిఎం 2. 0 ను ప్రధానోపాధ్యాయులు కామేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు నగరపంచాయతీ వైస్ చైర్మన్ ఎస్. రామారావు, కౌన్సిలర్లు ఎ. సత్యనారాయణ, ఎస్ఎంసి చైర్మన్ జి. కళ్యాణి, వైస్ చైర్మన్ నాగార్జున, గ్రామ పెద్దలు, యువజన సంఘ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.