శనివారం రోజున ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు లావేరు మండలం బెజ్జిపురంలో ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ వివరాలను ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.