నెల్లిమర్ల: "వైసిపి హయాంలో పేదలు సుభిక్షంగా బ్రతికారు"

వైసిపి పాలనలో పేదలు సంక్షేమ పథకాలు లబ్ధి పొంది సుభిక్షంగా బ్రతికారని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలం జరజాపుపేటలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కూటమి హయాంలో ప్రజలు సంక్షేమ పథకాలు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే హైటెక్ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్