నాతవలసలో నూతన సచివాలయ భవనం ప్రారంభం

డెంకాడ మండలం నాతవలసలో నూతన సచివాలయ భవనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతున్నాయని తెలిపారు. అవసరమైన సేవలు ఒకే చోట లభించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్