పూసపాటిరేగలో మహిళల భద్రతపై భారీ హోర్డింగుల ఏర్పాటు

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాడ, పూసపాటిరేగ, సీహెచ్ అగ్రహారం, కందివలస, జంక్షన్ లలో పోలీసులు భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం. ఈ హోర్డింగుల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని ఎస్సై దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్