పూసపాటిరేగ మండలంలోని గుంపాంలో శుక్రవారం జరిగిన జనావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. స్థానికుల నుంచి డ్రైనేజీ, రోడ్లు, చెత్త, శుభ్రత సమస్యలు తెలుసుకుని అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు.