పూసపాటిరేగ: అక్రమంగా నిర్వహించిన రేషన్ బియ్యం పట్టివేత

పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని భోగాపురం, గజపతినగరం, గంట్యాడ, రాజాం సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ల బృందం శనివారం రాత్రి పట్టుకున్నారు. అదే గ్రామంలో ఎర్రయ్య అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచాడని సమాచారంతో స్థానిక విఆర్ఓ తో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వెంటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్