రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన ఘటన పూసపాటిరేగ మండలంలో శనివారం చోటు చేసుకుంది. మండలంలోని కనిమెట్ట నేషనల్ హైవేపై విశాఖ నుండి కలకత్తా వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పరిశీలించి క్షతగాత్రుడిని 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.