గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్‌లకు బోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనూష అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై సర్పంచ్‌లను సత్కరించారు. ఐదేళ్లపాటు వారు చేసిన సేవలను, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల పక్షాన నిలిచిన తీరును ప్రశంసించారు. పదవీకాలం అనంతరం కూడా ప్రజలకు సేవ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.