నెల్లిమర్లలో ఉరుములు మెరుపులతో వర్షం

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజానీకం ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం పడింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. వర్షానికి రహదారులపై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్