భామిని: ఆటో బోల్తా.. ఒకరు మృతి

భామిని మండలంలోని బొడ్డగూడ సమీపంలో గురువారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒడిశాకు చెందిన వ్యక్తులు భామినిలో జరుగుతున్న వారపు సంతకు ఆటోలో వస్తుండగా బండ్ర సింగి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్