భామిని: డాల్ఫిన్ల సంరక్షణపై అవగాహన ర్యాలీ

భామని ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్ ప్రిన్సిపల్ జి. గంగాదేవి ఆధ్వర్యంలో శనివారం డాల్ఫిన్లు సంరక్షణపై విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. భారత ప్రభుత్వం డాల్ఫిన్లు సంరక్షణకై చేపట్టిన ప్రాజెక్ట్ డాల్ఫిన్ మిషన్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. డాల్ఫిన్ సంరక్షణపై ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. డాల్ఫిన్ల సంరక్షణ గురించి తెలిపే వీడియోను పాఠశాలలో ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్