మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జూలై 12 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్న నేపథ్యంలో పాలకొండ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు వై. హరిబాబు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు నిర్ణయంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలని షరతులు లేకుండా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలన్నారు.