అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా, రేపు ఉదయం 6 గంటలకు సీతంపేటలోని ఎన్‌టీఆర్ అడ్వెంచర్ పార్కులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 11న కురుపాం నియోజకవర్గంలో యోగాంధ్ర వేడుకలు విజయవంతంగా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. సీతంపేటలో జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. యోగా ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.