సాలూరులో ఆరోపణల దుమారం.. ఇరువర్గాలపై కేసులు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళను మోసగించి లైంగిక వేధింపులకు గురిచేశారనే ఫిర్యాదుతో మంత్రి అనధికార పీఏపై కేసు నమోదైంది. అదే సమయంలో, మంత్రి కుమారుడు, పీఏపై అసత్య ప్రచారం చేసి, వాట్సాప్ ద్వారా పరువు నష్టం కలిగించేందుకు ప్రయత్నించారనే ఫిర్యాదుపై ఆ మహిళపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. రెండు కేసులను ఫోరెన్సిక్‌కు పంపగా, నిష్పాక్షిక దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్