ఈ నెల 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన్యం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భామిని ఏపీ మోడల్ స్కూల్‌లో ముఖ్యమంత్రి మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొంటారు. భద్రత, పార్కింగ్, రహదారులు, పారిశుధ్యం, మీడియా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా విధులు సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.