మన్యం జిల్లాకి బీసీ కమిషన్ అధ్యక్షుడు రాక: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ మిశ్రా శనివారం జిల్లాకు రానున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుంది. బీసీ సంఘాలు, కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ వినతులను నేరుగా కమిషన్‌కు అందజేయవచ్చు.

సంబంధిత పోస్ట్