గిరిజన యువతి హత్య కేసులో ప్రియుడు, స్టాఫ్ నర్స్ అరెస్ట్

పార్వతీపురం మన్యం జిల్లాలో బిడ్డిక ఉషారాణి(32) అనే గిరిజన యువతి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. మృతురాలి ప్రియుడు రెడ్డి భువనేశ్వర్(25), అతని కజిన్ తేజేశ్వరరావు(23), స్టాఫ్ నర్స్ కృపారాణి(35)లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఉషారాణిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో, భువనేశ్వర్ కృపారాణితో కలిసి నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి, తర్వాత మరో చోట పడేసేందుకు ప్రయత్నించారు.