సాలూరు పట్టణంలో, బోసు బొమ్మ జంక్షన్ వద్ద మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చడానికి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈరోజు, సోమవారం, సాయిరాం మెడికల్ స్టోర్స్, పసుమర్తి నరేష్ దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రయాణికులు ఈ చల్లని మజ్జిగతో తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. నిర్వాహకులను ప్రజలు అభినందిస్తున్నారు.