ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన

పార్వతీపురం నియోజకవర్గంలో బచావో సంగ్రహణ కార్యక్రమంలో భాగంగా పెద్ద బొండపల్లి గ్రామంలో అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్, పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జ్ బత్తిన మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, జి. రాంజీ వీబీగా అమలు చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని, ఈ కొత్త చట్టంతో కార్మికులకు నష్టం జరుగుతుందని, కొత్త చట్టంలోని లోపాలను ప్రజలకు వివరించారు. ఉపాధి కార్మికులంతా మహాత్మా గాంధీజీ పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు. 90% నిధులు కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బొండపల్లి గ్రామస్తులు, ఉపాధి కార్మికులు, గ్రామ పంచాయతీ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్